బిగ్ బాస్-2 ఈసారి ఇంకొంచం మసాలా.. ప్రోమో అదుర్స్..!

May 19, 2018


img

అనుకున్నట్టుగానే సర్ ప్రైజింగ్ గా బిగ్ బాస్ ప్రోమోతో వచ్చాడు నాచురల్ స్టార్ నాని. స్టార్ మా నిర్మాణంలో బిగ్ బాస్ సీజన్ వన్ సూపర్ హిట్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ గా అదరగొట్టాడు. కంటెస్టంట్స్ అంత కిక్ ఇవ్వకున్నా సరే తారక్ తన వ్యాఖ్యానంతో బిగ్ బాస్ మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా నడిపించాడు.

ఎన్.టి.ఆర్ షో చేస్తున్న టైంలో స్టార్ మా టి.ఆర్.పి రేటింగ్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు నాచురల్ స్టార్ సెకండ్ సీజన్ హోస్ట్ గా చేయనున్నాడు. ప్రోమోలో టీ తో దర్శనమిచ్చిన నాని బాబాయ్ ఈసారి ఇంకొంచం మసాలా అంటూ చెప్పాడు. అంటే బిగ్ బాస్ 2 ఈసారి మరింత మసాలా యాడ్ చేస్తున్నారన్న మాట. మొదటి సీజన్ కొద్దిగా నీట్ గా హ్యాండిల్ చేయగా ఈ సెకండ్ సీజన్ దుమ్ముదులిపేస్తుందని అంటున్నారు.   





Related Post

సినిమా స‌మీక్ష