మిలియన్ డాలర్స్ 'మహానటి'..!

May 19, 2018


img

సావిత్రి జీవిత గాథను తెర మీద ఆవిష్కరిస్తూ వచ్చిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సావిత్రమ్మగా కీర్తి సురేష్ నటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. రిలీజ్ నాడు ప్రీమియర్స్ తో కలుపుకుని 1 మిలియన్ క్రాస్ చేయగా వారంలో ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది. 

అంతేకాదు రిలీజ్ అయ్యి వారం దాటుతుండగా అమెరికాలో మరిన్ని సెంటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, క్రిష్ అందరు రియల్ లైఫ్ పాత్రల్లో నటించి మెప్పించారు.



Related Post

సినిమా స‌మీక్ష