క్రిష్ చేతుల్లోకి ఆ బయోపిక్..!

May 18, 2018


img

మహానటి సినిమా వచ్చాక బయోపిక్ తీయడం ఆశామాషి విషయం కాదని అర్ధమైంది. కొత్త కుర్రాడే అయినా నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథను డీల్ చేసిన విధానానికి అందరు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బయోపిక్ ప్రస్థావించిన ప్రతిసారి ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి కూడా ఆలోచన వస్తుంది. తేజ డైరక్షన్ లో బాలకృష్ణ హీరోగా మొదలుపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి.

డైరక్టర్ గా తేజ వెనక్కి తగ్గగా బాలయ్య స్వయంగా తానే ఈ సినిమా డైరెక్ట్ చేయాలని చూశాడు కాని ఎందుకో వెనక్కి తగ్గాడు. తేజాని పిలిపించే ప్రయత్నాలు చేసినా అవేవి కుదరలేదని చెప్పాలి. తాజాగా ఎన్.టి.ఆర్ బయోపిక్ క్రిష్ చేతుల్లోకి వెళ్లిందని టాక్. బాలయ్య బాబు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ డైరక్షన్ లోనే వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఆ కృతజ్ఞతతో బాలయ్య క్రిష్ కు పిలిచి మరి అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ హీరోయిన్ గా మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్రతో ఈ సినిమా రాబోతుంది.



Related Post

సినిమా స‌మీక్ష