బన్ని అక్కడ బాగానే లాక్కొచ్చాడు..!

May 18, 2018


img

స్టార్ సినిమా అంటే భాషాబేధం లేకుండా ఆడేస్తుంటాయి. బాహుబలి అంత పెద్ద హిట్ అయ్యింది అంటే కేవలం తెలుగు వర్షన్ వల్ల మాత్రమే కాదు తెలుగుతో పాటుగా హింది ఇంకా సౌత్ అన్ని భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా బన్ని నటించిన నా పేరు సూర్య తెలుగులో కన్నా కేరళలో సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో అల్లు అర్జున్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే తన ప్రతి సినిమా అక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తాడు బన్ని. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య తెలుగు ఆడియెన్స్ కు నచ్చకున్నా మలయాళ ఆడియెన్స్ మాత్రం సూపర్ హిట్ చేసేశారు. అక్కడ ఈ సినిమా 12 రోజుల్లో 5 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాదాపు అక్కడ స్టార్ హీరోల సినిమాల రేంజ్ వసూళ్లను రాబట్టింది నా పేరు సూర్య.

అయితే ఇంతకుముందు బన్ని నటించిన సరైనోడు సినిమా ఫుల్ రన్ లో 7.60 కోట్లను వసూళు చేసింది. నా పేరు సూర్య కేవలం 12 రోజుల్లోనే ఆ ఫిగర్ కు దగ్గరయ్యింది. ప్రస్తుతం నా పేరు సూర్య 80 థియేటర్లలో మలయాళంలో ఆడుతుంది. 



Related Post

సినిమా స‌మీక్ష