అమేజాన్ ప్రైమ్ క్రేజీ వెబ్ సీరీస్..!

May 18, 2018


img

అమేజాన్ ప్రైమ్ ఓ కొత్త వెబ్ సీరీస్ కు శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉంటే చాలు ఎక్కడైనా చూపించేయొచ్చు అనే పంథాలో యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ బాగా ప్రాముఖ్యత పొందుతుండగా ఆ తర్వాత వెబ్ సీరీస్ లు కూడా అదే తరహాలో క్రేజ్ తెచ్చుకున్నాయి. యూట్యూబ్ లో వచ్చిన వెబ్ సీరీస్ లు క్లిక్ అవడంతో ఏకంగా అమేజాన్ ప్రైం లో వెబ్ సీరీస్ లను ప్లాన్ చేస్తుంది.

అందులో మొదటి ప్రయత్నంగా గ్యాంగ్ స్టర్స్ అంటూ టాలీవుడ్ లో క్రేజీ స్టార్స్ తో ఓ వెబ్ సీరీస్ సిద్ధం చేస్తుంది. దీనికి సంబందించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. నవదీప్, సిద్ధార్థ్, అపూర్వ, శ్వేతా బసు ప్రసాద్, జగపతిబాబు, పోసాని కృష్ణ మురళి, శివాజి లాంటి తారలు ఈ వెబ్ సీరీస్ లో ఉన్నారు. కాస్టింగ్ ఓ సినిమాకు సరిపడా ఉండగా వెబ్ సీరీస్ గా ఇది సరికొత్త ట్రెండ్ సృష్టించనుందని అంటున్నారు.

నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో అజయ్ భుయాన్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అమేజాన్ ప్రైం ఎక్స్ క్లూజివ్ గా రాబోతున్న ఈ వెబ్ సీరీస్ టీజర్ మాత్రం ఇంప్రెసివ్ గా ఉంది. మరి వెబ్ సీరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష