ఓ రోజు ముందే ఎన్టీఆర్ హంగామా..!

May 17, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ లు నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎన్.టి.ఆర్ బర్త్ డే మే 20న రివీల్ చేస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తని నిజం చేస్తూ నిర్మాతలు కన్ఫాం చేస్తూ ప్రకటన ఇచ్చారు. 

అంతేకాదు మే 20న తారక్ బర్త్ డే అయితే అంతకుముందు రోజే అనగా మే 19 నాడే సినిమా ఫస్ట్ లుక్ ఇంకా సినిమా టైటిల్ రిలీజ్ చేస్తారట. ఈ బర్త్ డే కు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఇచ్చే కానుక ఇదే అని చెప్పొచ్చు. జై లవ కుశ తర్వాత చిన్నపాటి గ్యాప్ తో ఎన్.టి.ఆర్ చేస్తున్న త్రివిక్రం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ అనుకున్న విధంగా జరుపుకుంటుండగా అక్టోబర్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష