మరో క్రేజీ మల్టీస్టార్ లో చరణ్..!

May 17, 2018


img

రంగస్థలం లో కెరియర్ బెస్ట్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆ హిట్ ఇచ్చిన జోష్ తో సినిమాల స్పీడ్ పెంచాడని తెలుస్తుంది. ఇప్పటికే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లిన చరణ్ ఆ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ లో కూడా నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ తో కలిసి నటించే ఆ సినిమా పోటాపోటీగా ఉంటుందని అంటున్నారు.


అదేకాకుండా మరో క్రేజీ మల్టీస్టారర్ కు చెర్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి చరణ్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. కె.ఎల్ రవిచంద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఈమధ్యనే మహానటిలో జెమిని గణేషన్ గా నటించి మెప్పించిన దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టికి తగ్గ తనయుడే అనిపించుకున్నాడు. మరి చరణ్ తో దుల్కర్ ఈ క్రేజీ మల్టీస్టార్ అయితే ఎక్కడ రివీల్ అవలేదు. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తేనే కాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష