ఎన్టీఆర్ కు 7.. నానికి 4..!

May 16, 2018


img

బిగ్ బాస్ ను తెలుగు బుల్లితెర మీదకు తెచ్చిన క్రెడిట్ దక్కించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. స్టార్ మా ప్రెస్టిజియస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యేలా చేసిన హీరో ఎన్.టి.ఆర్. తారక్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్ సక్సెస్ అయ్యింది. అయితే సెకండ్ సీజన్ కు ఎన్.టి.ఆర్ దూరమవడంతో ఆ బాధ్యత నాచురల్ స్టార్ నాని తీసుకున్నాడు.

జూన్ నుండి బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదలవుతుందని తెలుస్తుంది. ఇక ఇందుకు గాను నాని దాదాపు 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ రేంజ్ కు తగినట్టుగా బిగ్ బాస్ మొదటి సీజన్ కు 7 కోట్లు ఇవ్వగా నానికి 4 కోట్ల దాకా ఇస్తున్నారట. 4 కోట్లు కూడా తక్కువేం కాదని చెప్పాలి. ఇక ఈ సీజన్ 100 రోజుల దాకా ఉంటుందని టాక్.Related Post

సినిమా స‌మీక్ష