నా.. నువ్వే.. కొత్త కళ్యాణ్ రామ్..!

May 16, 2018


img

నందమూరి హీరో కళ్యాణ్ రాం హీరోగా జయేంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా నా.. నువ్వే. పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ రాం స్టార్ ఇమేజ్ కు దూరంగా లవర్ బోయ్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.

శరత్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగున్నట్టు తెలుస్తున్నాయి. జాకీగా తమన్నా కళ్యాణ్ రాం ను ప్రేమిస్తుంది.. ఆమెను రిజక్ట్ చేసే హీరో చివరకు ఆమె ప్రేమను ఎలా తెలుసుకున్నాడు అన్నది సినిమా కథ. మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కళ్యాణ్ రాం కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం కెరియర్ లో వెనుకపడిన తమన్నాకు ఈ సినిమా హిట్ చాలా అవసరం.  

Related Post

సినిమా స‌మీక్ష