ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ కు సిద్ధమా..!

May 16, 2018


img

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం సినిమా మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అక్టోబర్ కల్లా ఆ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కూడా లైన్ లో ఉంది. సినిమా మొదలవుతుంది అంటేనే అంచనాలు పెరుగగా రాబోతున్న ఎన్.టి.ఆర్ బర్త్ డే నాడు తారక్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడట.

త్రివిక్రం సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా రాజమౌళి సినిమాలోని కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తున్నాడట ఎన్.టి.ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీస్టారర్ లో ఎన్.టి.ఆర్ ఎలా ఉండబోతాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ బర్త్ డే తారక్ ఫ్యాన్స్ కు ఇస్తున్న ఈ డబుల్ ట్రీట్ అదిరిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష