సైరా లేటుకి కారణం ఆయనే..!

May 16, 2018


img

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖైది నంబర్ 150తో అదరగొట్టగా పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటిదాకా ఉన్న రికార్డులన్ని కొల్లగొట్టి చిరు సత్తా చాటగా ఇక 151వ సినిమాగా చరిత్ర కథను తెరకెక్కిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా సినిమా అనుకున్న విధంగా షూటింగ్ చేయలేకపోతున్నారట. దీనికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిరంజీవే అంటున్నారు.

60 ఏళ్లు పైబడిన చిరంజీవి సైరా కోసం యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారట. ఇదవరకు ఉన్న ఎనర్జీ ఉండదు కనుక షెడ్యూల్ షెడ్యూల్ కు బాగా గ్యాప్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. సొంత బ్యానర్ లో సినిమా కాబట్టి కుదిరినప్పుడే షూటింగ్ పెట్టుకున్నారు. మరి ఈ లెక్కన చూస్తే అనుకున్న 2019 సంక్రాంతి కాస్త సమ్మర్ కు వాయిదా పడినా పడొచ్చని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష