'మహానటి' కీర్తికి రాజమౌళి ఛాన్స్..!

May 16, 2018


img

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి అందరి మనసులను గెలిచిన కీర్తి సురేష్ కేవలం ప్రేక్షకుల మనసులనే కాదు సిని సెలబ్రిటీస్ ప్రశంసలను అందుకుంటుంది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి కీర్తి నటనకు ముగ్ధుడయ్యాడని తెలుస్తుంది. సావిత్రి ఆశీస్సులతోనే కీర్తి ఇలా నటించి ఉడొచ్చని ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

ఇక కీర్తి సురేష్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. సావిత్రి తర్వాత అంతటి అభినయం చూపించిన ఈ అమ్మడికి లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. రాజమౌళి కూడా తను తీయబోతున్న మెగా నందమూరి మల్టీస్టారర్ లో ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఛలో భామ రష్మికను ఆ సినిమాకు సెలెక్ట్ చేసిన జక్కన్న కీర్తిని సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేశాడట. అక్టోబర్ లో మొదలవనున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు నటిస్తున్నారని తెలిసిందే. Related Post

సినిమా స‌మీక్ష