రూటు మార్చేస్తున్న బన్ని..!

May 16, 2018


img

వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రీసెంట్ గా రిలీజ్ అయిన నా పేరు సూర్య పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి. యాంగ్రీ సోల్జర్ గా ఓ రేంజ్ లో కష్టపడిన బన్ని అందుకు తగిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఈ సినిమా ఫలితంపై నిరాశ చెందిన బన్ని రాబోయే సినిమాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్న బన్ని ఆ సినిమాను ఓ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. తన కెరియర్ లో ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలే తనకు మంచి పేరు తెచ్చాయి అంతేకాదు సూపర్ హిట్ సాధించాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం అలాంటి కోవలోనే వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. అందుకే సీరియస్ సబ్జెక్టులకు గుడ్ బై చెప్పి ఎంటర్టైనర్ కథలను చేయబోతున్నాడట బన్ని. ఓరకంగా అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం తెలివైనదే అని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష