బిచ్చగాడు హీరో అదే ఫార్ములాతో..!

May 15, 2018


img

బిచ్చగాడు సినిమాతో తెలుగులో అనూహ్యంగా ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత సినిమాలకు ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూశాడు కాని వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం విజయ్ ఆంటోని హీరోగా ఉదయనిధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కాశి. మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్రయూనిట్.

ఇక బేతాళుడు, యమన్ సినిమాల మాదిరిగానే కాశి సినిమాను రిలీజ్ కు ముందే ఓ 7 నిమిషాల సినిమా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాపై ఎక్సైట్మెంట్ కలిగేందుకు మొదటి 7 నిమిషాల సీన్ అఫిషియల్ గా రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో ఇదొక భాగమని చెప్పొచ్చు. అయితే ఇంత చేసినా విజయ్ ఆంటోనీ మళ్లీ బిచ్చగాడు మ్యాజిక్ రిపీట్ చేస్తాడని మాత్రం చెప్పలేం. సినిమా రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ మాత్రమే వదులుతారు కాని విజయ్ తన ప్రతి సినిమాకు తెలుగులో ముందు కొంత సినిమా చూపించేస్తున్నాడు. మరి అది ఎంతవరకు తన సినిమా ఫలితానికి సహకరిస్తుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష