మహానటి ఆమెను నిరాశపరచింది..!

May 15, 2018


img

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి మూవీ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాపై ఏ ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడిన వారు లేరు కాని బిందు చంద్రమౌళి మాత్రం సినిమాపై తన అసంతృప్తిని వ్యక్తపరచింది. ఇంతకీ ఎవరీ బిందు చంద్రమౌళి అంటే మహానటి సినిమాలో పుష్పవల్లి పాత్ర చేసిన నటి అని తెలుస్తుంది. జెమిని గణేషన్ స్నేహితురాలు పుష్పవల్లి పాత్రలో బిందు చంద్రమౌళి నటించారు.

సినిమా రన్ టైం ఎక్కువడంతో ఆమె సీన్స్ సినిమా నుండి తొలగించారు. పుష్పవల్లి ఆమె కుమార్తె రేఖ(సీనియర్ నటి రేఖ) పాత్రల్ని తొలగించారు. దీనిపై స్పందించిన బిందు చంద్రమౌళి సినిమాలో తన పాత్ర కట్ చేసినందుకు చాలా బాధపడ్డానని.. అయినా పర్వాలేదు చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పుకొచ్చింది. సినిమాలో తెర మీద తన పాత్రలేకున్నా మహానటి సినిమాలో నటించానన్న సంతృప్తి తనకు ఉందని అన్నది. ఇదవరకు సినిమాల్లో కూడా తన పాత్ర ఎడిటింగ్ లో తీసేస్తే బాధపడ్డానని కాని ఈసారి ఎక్కువ నిరాశకు గురయ్యానని అన్నది బిందు చంద్రమౌళి. 

అయితే థియేటర్ వర్షన్ లో ట్రిం చేసినా అమేజాన్ ప్రైం ఇంకా శాటిలైట్ వర్షన్ లో మాత్రం ఫుల్ మూవీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మహానటి శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వారు 11 కోట్లతో సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష