నా పేరు సూర్య రివ్యూ & రేటింగ్

May 04, 2018


img

రేటింగ్ : 2.5/5

కథ :

సోల్జర్ అయిన సూర్య (అల్లు అర్జున్) దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే అన్నట్టుగా ఉంటాడు. ఈ క్రమంలో అతను బోర్డర్ కు వెళ్లి అక్కడ కాపలా కాయాలని కలలు కంటుంటాడు. ఇక కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్టుని చంపేశాడని తనపై అధికారి ఆర్డర్ ప్రకారం ఓ సైకాలజిస్ట్ తో సర్టిఫికెట్ తెచ్చుకోమని చెబుతాడు. ఆ సైకాలజిస్ట్ ఎవరో కాదు సూర్య తండ్రి రామకృష్ణ రాజు (అర్జున్). అతని సైన్ కోసం వెళ్లిన సూర్య ఏం చేశాడు. అక్కడ తనకి ఎదురైన సందర్భాలు ఏంటి అన్నది సినిమా కథ.

విశ్లేషణ : 

యాంగ్రీ సోల్జర్ కథ చెబుతూ వస్తూ అతని పాత్రని క్యారక్టరైజేషన్ ను బాగా ఎలివేట్ చేసిన దర్శకుడు. సినిమా కంటెంట్ ను మొదలు పెట్టడం బాగానే మొదలు పెట్టినా దాన్ని రాను రాను వీక్ చేశాడు. బోర్డర్ లో యుద్ధం చేసేందుకు సిద్ధమైన సైనికుడిని అతనితో తనకే యుద్ధం చేసుకునేలా రాసుకున్నాడు కథ.

ఇక ఇలాంటి అతనికి సమాజంలో తప్పులు చేస్తూ చల్లా లాంటి పాత్ర ఎదురుపడటం జరుగుతుంది. హీరో ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని పాత్రని డిజైన్ బాగానే చేసిన దర్శకుడు కథనంలో ఆ గొప్పతనం తీసుకురాలేకపోయాడు. ఇక ఫైనల్ గా ఓ ఇంటి కోసం హీరో సైనికుడిగా మారడం.. వారి ప్రాణాలను కాపాడటం అన్యాయం జరిగిన ఆ సోల్జర్ తనయుడు ఎలాంటి సంఘ విద్రోహ శక్తిగా మారకుండా చేయడం ముగింపులో వస్తుంది. 

సినిమా కథగా బాగా రాసుకున్న వక్కంతం వంశీ దాన్ని చెప్పే ప్రయత్నంలో కొంత ల్యాగ్ చేశాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని నా పేరు సూర్య సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా మాత్రం బన్ని వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ చేసినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. యాక్షన్ డోస్ ఎక్కువైందని కూడా అనిపిస్తుంది. 

నటన, సాంకేతికవర్గం పనితీరు :

అల్లు అర్జున్ సూర్యగా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నిటిలో బన్ని బాగా చేశాడు. ఇక అను ఇమ్మాన్యుయెల్ మాత్రం కేవలం పాటలకే పరిమితం అయ్యింది. తండ్రి పాత్రలో అర్జున్ యాక్టింగ్ బాగుంది. సైకాలజిస్ట్ గా అర్జున్ ఆకట్టుకున్నాడు. ఇక రావు రమేష్, బొమన్ ఇరాని, శరత్ కుమార్ పాత్రలు ఇంప్రెస్ చేశాయి. 

టెక్నికల్ టీం విషయానికొస్తే.. రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ నెస్ తీసుకువచ్చింది. విశాల్ శేఖర్ మ్యూజిక్ కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ కాస్త గ్రిప్పింగ్ మిస్ అయ్యింది. సినిమా దర్శకుడు వక్కంతం వంశీ కథ బాగానే రాసుకున్నా కథనంలో ఆ థ్రిల్ మిస్సయ్యేలా చేశాడు.   

ఒక్కమాటలో :

అల్లు అర్జున్ కోసం మాత్రం నా పేరు సూర్య చూడొచ్చు. కథ, కథనాలు కాస్త అటు ఇటుగా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం నచ్చే సినిమా అవుతుంది.



Related Post

సినిమా స‌మీక్ష