కేటీఆర్ మెప్పు పొందిన సిఎం భరత్..!

April 25, 2018


img

మహేష్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. బాక్సాఫీస్ పై విజయ భేరి మోగిస్తున్న ఈ సినిమా గురిచి పబ్లిక్ టాక్ విన్న తెలంగాణా మంత్రి కేటీఆర్ స్పెషల్ షో వేయించుకుని సినిమా చూశారు. మహేష్, కొరటాల శివ, నిర్మాత దానయ్య ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో కేటీఆర్ సినిమా వీక్షించారు.

మీ అందరికి ఓ సర్ ప్రైజ్.. భరత్ అనే నేను సినిమా చూసిన ఎంజాయ్ చేసిన నేను ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంకా స్నేహితుడు మహేష్ తో ఇంటరాక్ట్ అయ్యాను అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పెట్టారు. పబ్లిక్ లైఫ్ లో కొన్ని ముఖ్య అంశాల మీద తీసిన ఈ సినిమా గురించి చర్చించడం జరిగిందట. దీనికి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మరి ఈ ఇంటర్వ్యూ ఏ ఛానెల్ లో వస్తుందో చూడాలి. డివివి దానయ్య నిర్మించిన భరత్ అనే నేను సినిమా కే.టీ.ఆర్ మెప్పు పొందడం విశేషం. సినిమా ఆల్రెడీ సూపర్ సక్సెస్ తో ముందుకు దూసుకెళ్తుంది.Related Post

సినిమా స‌మీక్ష