ఐ సపోర్ట్ పవన్ అన్న..!

April 24, 2018


img

పవన్ కళ్యాణ్ పలు ఛానెల్స్ మీద చేస్తున్న ఫైట్ కు సపోర్ట్ గా నిలిచాడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్. పవన్ అన్న వెంట నేనుంటా అంటూ ఓ లెటర్ ను పెట్టాడు. ఈమధ్య శ్రీరెడ్డి చేత పవన్ తల్లిని దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ ఫిల్మ్ చాంబర్ లో దీని గురించి లాయర్లతో చర్చలు జరిపాడు కూడా.

కాస్టింగ్ కౌచ్ సమస్య కాస్త పక్కన పెట్టి శ్రీరెడ్డి పవన్ ఇష్యూ మీద అందరి ఫోకస్ ఏర్పడింది. ఇక శ్రీరెడ్డి వెనుక ఆర్జివి ఉన్నాడనేసరికి వ్యవహారం మరింత ముదిరింది. టివి9, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి5 మీద పవన్ విమర్శలు గుప్పించాడు. యెల్లో మీడియా అంతా కలిసి తన మీద కక్ష సాధిస్తుందని అన్నారు. ఇక పవన్ కూడా వారి లీకులను ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ అంతా గమనిస్తున్న మనోజ్ తన సపోర్ట్ పవన్ అన్నకే అంటూ ట్వీట్ చేశాడు.

 


Related Post

సినిమా స‌మీక్ష