హీరోల సమావేశం ముగిసింది..!

April 24, 2018


img

మీడియా స్టార్స్ పై చూపిస్తున్న అత్యుత్సాహం వల్ల అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల కత్తి మహేష్, శ్రీరెడ్డిల వల్ల అటు మీడియాకు ఇటు స్టార్స్ కు పెద్ద ఎఫెక్టే పడింది. ఇక పవన్ ఇష్యూలో వర్మ జోక్యం పెద్ద హంగామానే సృష్టించింది. ఇక దీనికి సంబందించి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు 20 మంది అన్నపూర్ణ స్టూడియోస్ లో సమావేశమయ్యారు.

చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగార్జున, ఎన్.టి.ఆర్, మహేష్, నాని, అఖిల్ ఇలా 20 మంది హీరోల దాకా అటెండ్ అయ్యారట. నిర్మాతల మండలి నుండి కూడా కొందరు ప్రముఖ నిర్మాతలు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో హీరోలు కొన్ని సమస్యలను లేవనెత్తగా ప్రస్తుత పరిణామాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. మీడియాతో ఎలా వ్యవహరించాలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు వర్మ పవన్ ల ఇష్యూ కూడా చర్చల్లో భాగమైందని తెలుస్తుంది. మరి వీరంతా కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష