కాస్టింగ్ కౌచ్ ఇప్పటిది కాదు..!

April 24, 2018


img

కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి లేవనెత్తిన ఉద్యమం కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ దాకా పాకింది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా శ్రీరెడ్డికి సపోర్ట్ గా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఈరోజు వచ్చింది కాదని అది ఎప్పటినుండో ఉందని సంచలన కామెంట్స్ చేసింది ప్రముఖ బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.

ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొనగా కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. కాస్టింగ్ కౌచ్ కేవలం ఇండస్ట్రీలోనే కాదు ప్రభుత్వ రంగాల్లో కూడా ఉందని అన్నది. కాస్టింగ్ కౌచ్ అనేది మంచిదే అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే కాస్టింగ్ కౌచ్ కు బలవ్వాలా లేదా అని ఆమె మీద ఆధారపడి ఉంటుందని అన్నారు సరోజ్ ఖాన్. 

మొత్తానికి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చాలా కామన్ అంటూ సరోజ్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఓ పక్క పవన్ ను బూతులు తిట్టిన శ్రీరెడ్డి అది వర్మ చేయించాడని చెప్పి తాను సైడ్ అయ్యింది. 3,4 రోజుల నుండి ఆమె ఏ స్టూడియోలో కనిపించకపోవడం విశేషం.



Related Post

సినిమా స‌మీక్ష