ముఖ్యమంత్రి అంటే మహేషే..!

April 23, 2018


img

సూపర్ స్టార్ మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 60 కోట్ల షేర్ తో 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో హంగామా సృష్టిస్తుంది. కొరటాల శివ అద్భుతమైన కథతో ఈ సినిమా అంతకంటే అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సిఎం పాత్రలో మహేష్ తప్ప తాను ఎవరిని ఊహించుకోలేదని చెబుతున్నారు కొరటాల శివ.

ఎక్కువ మాట్లాడకుండా ప్రభావం చూపించే భరత్ పాత్రలో మహేష్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. వాయిస్ పెంచకుండా మాట్లాడినా అతని మాటలు జనాలు వినాలి. అందుకే భరత్ పాత్రకు మహేష్ ను సెలెక్ట్ చేసుకున్నా. భరత్ గా మహేష్ పర్ఫెక్ట్.. ముఖ్యమంత్రి అంటే మహేష్ బాబే అంటూ భరత్ అనే నేను సక్సెస్ థ్యాంక్స్ మీట్ లో చెప్పుకొచ్చాడు కొరటాల శివ. 



Related Post

సినిమా స‌మీక్ష