కృష్ణార్జున యుద్ధం.. నానిని వెనక్కి నేట్టేసిందిగా..!

April 21, 2018


img

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని రీసెంట్ గా కృష్ణార్జున యుద్ధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ నాటి నుండి బిలో యావరేజ్ టాక్ తో నడుస్తుంది. మేర్లపాక గాంధి డైరక్షన్ లో నాని డ్యుయల్ రోల్ చేసిన కృష్ణార్జున యుద్ధం నాని హిట్ మేనియాకు బ్రేక్ వేసిందని చెప్పాలి. సినిమా రిలీజ్ అయ్యి వారం అవుతున్నా ఇంకా 14 కోట్ల కలక్షన్స్ మాత్రమే రాబట్టింది.

ఇక నిన్న భరత్ అనే నేను రిలీజ్ తో చాలా చోట్ల ఈ సినిమాను ఎత్తేశారు. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన నాని కృష్ణార్జున యుద్ధం సినిమా నాని ఇదవరకు సినిమాల ఫలితాన్ని అందుకోలేకపోయింది. అంతేకాదు వరుసగా 7 హిట్లు కొట్టినా నానిని ఈ కృష్నార్జున యుద్ధం మళ్లీ మూడేళ్లు వెనక్కి వెళ్లేలా చేసిందని అంటున్నారు. 

మరి ఇకనుండైనా నాని కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని కొందరు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం నాని శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష