శ్రీరెడ్డి పై రాయదుర్గం పి.ఎస్ లో కేసు..!

April 19, 2018


img

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ను.. అతని తల్లిని అవమానించేలా మాట్లాడిన శ్రీరెడ్డి మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ నుండి కూడా పవన్ కు సపోర్ట్ గా శ్రీరెడ్డి మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ అభిమాని అయిన నటుడు శివ బాలాజి ఏకంగా రాయదుర్గం పిఎస్ లో శ్రీరెడ్డి మీద కేసు కూడా వేశాడు. 

పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేసు వేయడం జరిగింది. వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శివ బాలాజి కోరారు. అయితే శ్రీరెడ్డి చేత ఈ నాటకం నడిపించింది రాం గోపాల్ వర్మ అని ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన మీద కూడా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు కొందరు పవన్ అభిమానులు. మొత్తానికి శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్ కౌచ్ పక్కకు జరిగి పవన్ కళ్యాణ్ మీద వీరి అక్కసు బయట పడేలా చేసింది. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందన్నది చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష