అల్లు అరవింద్ ప్రెస్ మీట్.. రాం గోపాల్ వర్మ ఓ ఇంటిలిజెంట్ క్రూక్..!

April 19, 2018


img

పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాం గోపాల్ వర్మ కారణమని తెలిసి ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కు.. ఇండస్ట్రీలో సీనియర్ నిర్మాత అయిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి వర్మను టార్గెట్ చేశారు. ముందుగా కాస్టింగ్ కౌచ్ మీద ఇండస్ట్రీ తీసుకునే తదుపరి చర్యల గురించి ప్రస్థావించిన అల్లు అరవింద్ ఆ తర్వాత తన మెయిన్ టార్గెట్ వర్మ అని అన్నారు. మిస్టర్ రాం గోపాల్ వర్మ అంటూ మొదలు పెట్టిన అల్లు అరవింద్ తనకు అవకాశం ఇచ్చిన తల్లి లాంటి తెలుగు ఇండస్ట్రీకి ద్రోహం చేస్తున్న వర్మ ఓ నికృష్టుడని అన్నారు. అన్నం పెట్టిన ఇండస్ట్రీ పరువుని బజారుకీడ్చాలని చూస్తున్నారని అన్నారు.

శ్రీరెడ్డి చేత పవన్ ను తిట్టించింది వర్మ అని తెలిసి నిద్ర పట్టలేదని. అందుకే ఈ ప్రెస్ట్ మీట్ పెట్టానని అన్నారు అరవింద్. శ్రీరెడ్డి మ్యాటర్ పై సురేష్ బాబుతో మాట్లాడి 5 కోట్ల సెటిల్మెంట్ చేస్తానన్న వర్మ మెగా ఫ్యామిలీని ఎందుకు గుర్తుకు రాలేదని అన్నారు. కేవలం పవన్ మీద ఉన్న పగని దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నాడని. ఇలాంటి నీచుడిని ఏం చేయాలో ఇండస్ట్రీతో పాటుగా సమాజమే ఓ నిర్ణయానికి రావాలని అన్నారు. ఈ సందర్బంలో రాం గోపాల్ వర్మ ఓ ఇంటిలిజెంట్ క్రూక్ అని అన్నారు.

ఫ్యామిలీకి దూరంగా ఉండి పవన్ ఏదో చేయబోతున్నాడు. 10 సంవత్సరాల క్రితం తమకు జరిగిన అన్యాయాన్నే ఇప్పుడు పవన్ కు చేయాలని చూస్తున్నారని. దాన్ని ఆయన గుర్తించాలని అన్నారు. వర్మ మీద విరుచుకు పడిన అల్లు అరవింద్ నీ బ్రతుకేంటో నాకు తెలుసని.. నీ వెనుక ఎవరున్నారో త్వరలో తెలుస్తుందని అన్నారు. 

మొత్తంగా శ్రీరెడ్డి వెనుక వర్మ ఉన్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అల్లు అరవింద్ వ్యాఖ్యలకు వర్మ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష