మల్టీస్టారర్ కాన్సెప్ట్ అదేనా..!

April 18, 2018


img

సోలోగా సూపర్ హిట్లు కొడుతూనే మల్టీస్టారర్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీకి ఓ నూతన ఉత్సాహాన్ని తెస్తున్నారు నేటి స్టార్లు. ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ సినిమా కలిసి నటిస్తుండగా.. మరోపక్క శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగార్జున, నాని కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డాక్టర్ గా కనిపిస్తుండగా.. నాగార్జున డాన్ గా దర్శనమిస్తాడట.

అంతేకాదు రంగస్థలం సినిమాలో ఫైనల్ గా వచ్చే ట్విస్ట్ లానే ఈ సినిమా కూడా ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందట. సినిమాకు హైలెట్ అనిపించే సీన్స్ లో ఇదొకటని అంటున్నారు. కృష్ణార్జున యుద్ధంతో కాస్త నిరాశపరచిన నాని ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి నాగ్, నానిల మల్టీస్టారర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష