కాస్టింగ్ కౌచ్ కోసం శ్రీరెడ్డి లేవనెత్తిన ఉద్యమం మొదట అంత ప్రాధాన్యత లేకున్నా సరే ఫైనల్ గా ఆమెకు అందరి మద్ధతు లభించింది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మీద అర్ధ నగ్న ప్రదర్శన చేసిన నాటి నుండి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. శ్రీరెడ్డి కూడా రోజు స్టూడియోల చుట్టూ తిరుగుతూ కాస్టింగ్ కౌచ్ పై అందరు మాట్లాడేలా చేసింది. అక్కడ వరకు బాగున్నా పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డికి సలహా ఇవ్వడం దానికి ఆమె స్పందించిన తీరు ఆమెను మళ్లీ చిక్కుల్లో పడేసింది.
పవన్ కళ్యాణ్ ను అన్నా అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా.. అంటూ పవన్ తల్లిని దూషించింది శ్రీరెడ్డి. నోరు ఉంది కదా అని ఏమాటపడితే ఆమాట అనేస్తే ఎలా.. పవన్ అభిమానులు శ్రీరెడ్డి మీద ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు. ఫైనల్ గా ఆమెను ఓ చర్చా వేదికలో క్షమించమని కూడా అడిగింది. అసలు అలా అనడం ఎందుకు తర్వాత తప్పైందని అనడం ఎందుకని అంటున్నారు.
అసలు ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేని పవన్ కళ్యాణ్ ను ఎందుకు లాగినట్టు. అందరి లానే ఆయన కూడా ఏమన్నా ఉంటే చట్టపరమైన విధానం ఫాలో అవమని చెప్పాడు. దాని మాత్రానే అతన్ని అతని తల్లిని దూషించాల్సిన అవసరం ఏముంది.. ఇది కచ్చితంగా పవన్ ను కావాలని టార్గెట్ చేయడమే అని తెలుస్తుంది. దీని వెనుక ఎవరి హస్తం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. జనసేన అంటూ జనంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అనుకుంటున్నారు. శ్రీరెడ్డికి పవన్ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువవడం వల్ల తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. అంతేకాదు కాస్టింగ్ కౌచ్ నిరసన కాస్త పక్కదారి పట్టేసిందని శ్రీరెడ్డికి సపోర్ట్ ఇచ్చిన వారంతా వెనక్కి తగ్గుతున్నారు.