జీవిత రాజశేఖర్ ఈజ్ ఆన్ ఫైర్

April 17, 2018


img

కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ లో రచ్చ ఇంకా కొనసాగుతుంది. శ్రీరెడ్డికి సపోర్ట్ గా కొందరు మాట్లాడుతుంటే ఆమెను వ్యతిరేకిస్తూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ టివి ఇంటర్వ్యూలో హీరో రాజశేఖర్ పై సంచలన్ వ్యాఖ్యలు చేసింది సామాజిక కార్యకర్త సంధ్య. రాజశేఖర్ అమ్మాయిల పిచ్చోడని స్వయంగా జీవితనే దగ్గరుండి ఆయనకు అమ్మాయిలను సప్లై చేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన జీవిత ప్రెస్ మీట్ పెట్టి వాయించేశారు.

తన మీద తన భర్త మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని.. అసలు ఏ ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాస్టింగ్ కౌచ్ గురించి టివిల్లో మాట్లాడమని పిలిచారని కాని ఆ చర్చలు చాలా అసహ్యంగా అనిపించడం వల్ల తాను రాలేదని అన్నాది.

మహిళా హక్కుల కోసం పోరాడే సంధ్య ఓ ఆడదానిపై ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తుందని అన్నారు. టివిల్లో డిబెట్ల పేరుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని. సంధ్య మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఇక శ్రీరెడ్డికి చానెల్స్ వారు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావట్లేదని. ఏ పాత్రకి ఎవరిని తీసుకోవాలో దర్శక నిర్మాతలకు తెలుసని.. సినిమా ఆడినా ఆడకున్నా నిర్మాతలు సినిమాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని. నటించగలిగే ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశాలు వస్తాయని అన్నారు. ఇక పరిశ్రమలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు జీవిత రాజశేఖర్. 



Related Post

సినిమా స‌మీక్ష