తల్లి, భార్య తప్ప జీవితంలో మరో స్త్రీ లేదు..!

April 17, 2018


img

శ్రీరెడ్డి పేల్చిన బాంబ్ వల్ల స్టార్స్ కూడా వణుకు మొదలైంది. కాస్టింగ్ కౌచ్ మీద ఇన్నాళ్లు నోరు విప్పని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఫైనల్ గా ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. శ్రీరెడ్డి కొరటాల శివ మీద కూడా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కొరటాల శివ ఓ వీడియో మెసేజ్ ను రిలీజ్ చేశాడు.

తన మీద వచ్చిన వార్తలన్ని అవాస్తవమని.. తన జీవితంలో తల్లి, భార్య తప్ప మరో స్త్రీ లేదని అన్నారు. భరత్ అనే నేను కోసం 20 రోజులు డే అండ్ నైట్ కష్టపడి ఫైనల్ కాపీ సిద్ధం చేశామని. తాను తీసిన సినిమాలే తన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తాయన్న కొరటాల శివ తాను కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకమని.. తాను కూడా అది ఎంకరేజ్ చేయనని అన్నారు. స్వామి వివేకానంద అమెరికాకు వెళ్లినప్పుడు వదంతులు వచ్చాయని అవేమి ఆయన పట్టించుకోలేదని అన్నారు. 

తన గురించి తాను కాదు సినిమాలే మాట్లాడుతాయని అన్నారు కొరటాల శివ. మహేష్ హీరోగా వస్తున్న భరత్ అనే నేను 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ సిఎంగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 





Related Post

సినిమా స‌మీక్ష