అంతకుమించిన అదృష్టం ఏముంది..!

April 17, 2018


img

యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న అనసూయ సినిమాల్లో కూడా వచ్చిన అవకాశాలను బాగా యూజ్ చేసుకుంటుంది. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ మంచి నటన కనబరచింది. సినిమాలో ఆమె పాత్రకు కూడా మంచి మార్కులు పడ్డాయి. చరణ్ బోయపాటి సినిమాలో కూడా అనసూయకు లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్. 

అంతేకాదు మెగాస్టార్ 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయం ఆమెని అడిగితే అలాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తా చిరుతో నటించే అదృష్టం ఎవరు కాదంటారని అన్నది అనసూయ. ఓ పక్క స్మాల్ స్క్రీన్ మరోపక్క బిగ్ స్క్రీన్ ఇలా రెండిటిలో అనసూయ అదరగొడుతుందని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష