భరత్ సెన్సార్ పూర్తి.. సింగిల్ కట్ లేకుండానే..!

April 17, 2018


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ టీం ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించారు. సినిమా మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాగా వస్తుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను మెచ్చుకున్నట్టు తెలుస్తుంది. 

మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సింగిల్ కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందట. రన్ టైం కూడా 3 గంటల 7 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష