అనగనగా ఓ మహారాణి.. టీజర్ ఇంప్రెసివ్..!

April 17, 2018


img

నాగ్ అశ్విన్ డైరక్షన్ లో మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న సినిమా మహానటి. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ పై ఆడియెన్స్ స్పందన బాగుంది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూయర్ షిప్ తో మహానటి టీజర్ ట్రెండింగ్ లో ఉంది. సావిత్రి జీవిత గాథతో వస్తున్న ఈ మహానటిలో కీర్తి సురేష్ మహానటి సావిత్రిగా నటిస్తుంది.

దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, షాలిని పాండే వంటి వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అనగనగా ఓ మహారాణి అంటూ వచ్చిన మహానటి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా కచ్చితంగా సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అంటున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రియాంకా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 





Related Post

సినిమా స‌మీక్ష