శ్రీరెడ్డి పానకంలో పుడక లాంటిది : మురళి మోహన్

April 16, 2018


img

కాస్టింగ్ కౌచ్ మీద అర్ధ నగ్న ప్రదర్శన చేసి మా మీద వినూత్న నిరసన ప్రకటించిన శ్రీరెడ్డి మీద మాజీ మా అధ్యక్షుడు మురళీ మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డి హిందూ ధర్మాన్ని మరచి అలా చేసిందని ఇలా చేయడ అసలు కరెక్ట్ కాదని.. అందరూ సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. మా లో ప్రతి ఒక్కరి సభ్యత్వం ఇవ్వడం కుదరదని అన్నారు.

జూనియర్ ఆర్టిస్ట్ అసోషియేషన్స్ కు ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉండటంతో అందరికి మా సభ్యత్వం మీద చూపు పడిందని అన్నారు. అసలు ఆమె మాలో మెంబర్ షిప్ కు దరఖాస్తు చేసిందో లేదో తెలియదని అన్నారు. అయితే సభ్యత్వం ఇవ్వకున్నా ఇలా రోడ్డు మీద బట్టలిప్పడం లాంటిది దారుణమని అన్నారు మురళి మోహన్. అంతేకాదు మీదియాలో డిబెట్లు పెట్టడం చాలా మనస్తాపం కలిగించిందని అన్నారు.

శ్రీరెడ్డి ఇలా నిరసన తెలపడం వల్ల ఏం ఒరిగిందని ఆయన ఎదురు ప్రశించారు. శ్రీరెడ్డి వల్ల చాలా మందికి నష్టం ఏర్పడిందని.. శ్రీరెడ్డికి ఎదురైన కష్టాలన్ని కేవలం ఆమె వ్యక్తిగతమని అన్నారు. అసలు శ్రీరెడ్డి వివాదం పెద్దది కాదని.. కేవల ఆమె పానకంలో పుడక లాంటిదని అన్నారు.. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవక్సరం లేదని ఆయన అన్నారు.  Related Post

సినిమా స‌మీక్ష