చెర్రికి పవన్.. బన్నికి చిరు..!

April 16, 2018


img

రంగస్థలం అంటూ సూపర్ హిట్ అందుకున్న రాం చరణ్ ఆ సినిమా సక్సెస్ మీట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేశాడు. సినిమా మీద పవన్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఆస్కార్ కు వెళ్లే అన్ని అర్హతలు ఉన్న సినిమా అని చెప్పడం విశేషం. వాస్తవికతను చాలా గొప్పగా చూపించారని అన్నారు. అయితే చరణ్ పవన్ తో సక్సెస్ మీట్ జరుపగా బన్ని చిరుతో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు. 

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా సాంగ్ షూట్ జరుపుతుండగా మెగాస్టార్ చిరంజీవి సర్ ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. బన్ని డ్యాన్సులు చూసి ముచ్చటపడ్డారట. మే 4న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు.

మెగా ఫ్యాన్స్ మధ్య చీలిక ఏర్పడింది అన్న వాదనలను పక్కన పెట్టేలా అటు చరణ్, ఇటు బన్ని వారి సినిమాల ప్రమోషన్స్ కు చిరు, పవన్ లను వాడేస్తున్నారు. మెగా హీరోల్లో అల్లు అర్జున్ మాత్రమే కొందరి ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. మరి నిజంగానే మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే అని ప్రూవ్ చేస్తారో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష