రంగస్థలం మెగా సంబరం ఈరోజే..!

April 13, 2018


img

మెగా పవర్ స్టార్ స్టామినా తెలియచేస్తూ బాక్సాఫీస్ మీద తన సత్తా ఏంటో చూపించాడు. రాం చరణ్ లోని నటుడిని ఆవిష్కరించిన రంగస్థలం వసూళ్లు నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అయ్యి ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ దాదాపు 100 కోట్ల షేర్ తో రంగస్థలం వసూళ్ల దందా కొనసాగిస్తుంది.

ఇక ఈ సినిమా ఇంతటి గ్రాండ్ సక్సెస్ అయినందుకు సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మొదట నోవాటెల్ లో ఏర్పాటు చేయాలనుకున్న ఈ ఈవెంట్ ఫ్యాన్స్ ఎక్కువ వస్తారని ఊహించి హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు. రంగస్థలం సినిమా చూసిన పవన్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతా అని చెప్పారు. మొత్తానికి మెగా సంబరంతో ఈరోజు మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ఈ సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష