వెనక్కి తగ్గిన మా.. శ్రీరెడ్డికి ఆహ్వానం..!

April 13, 2018


img

కాస్టింగ్ కౌచ్ మీద వీరంగం ఆడుతూ టాలీవుడ్ ను మాత్రమే కాదు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డి ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాంతో పాటుగా తెలుగు రచయిత కోనా వెంకట్ గురించి ఆమె బయటపెట్టింది. అయితే ఫిల్మ్ చాంబర్ పై అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో మా కమిటీ ఆమెకు మెంబర్ షిప్ ఇచ్చేది లేదని తేల్చేసి చెప్పారు. అంతేకాదు మెంబర్ షిప్ ఉన్న 900 మంది ఆమెతో నటించకూడదని అన్నారు.

దీనిపై రకరకాల వాదనలు వినిపించడంతో ఆ మాటని వెనక్కి తీసుకున్నారు. ఆమె ఆరోజు చేసిన పని వల్లే ఆవేశంతో అలా అన్నామని అన్నారు మా అధ్యక్షుడు శివాజిరాజా. రామా శ్రీరెడ్డి వచ్చి అందరితో నటించమని అన్నారు శివాజి రాజా. మా అనేది ఎవరికి అవకాశాలు ఇప్పించదని. దర్శక నిర్మాతలే అవకాశాలు ఇస్తారని అన్నారు. ముఖ్యంగా సీనియర్లకు అవకాశం ఇప్పించాలని మా ప్రయత్నిస్తుందని అన్నారు. 

మొత్తానికి మొన్న కాదన్న మానే ఈరోజు రమ్మని అన్నది. అంతేకాదు కాస్టింగ్ కౌచ్ మీద ఓ స్పెషల్ కమిటీ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. 20 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో 10 మంది సినిమా వాళ్లు.. మరో పది మంది వివిధ రంగాలకు చెందిన వారు ఉంటారట.Related Post

సినిమా స‌మీక్ష