క్రిష్ అహం బ్రహ్మస్మి బన్నితోనా..?

April 12, 2018


img

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేస్తున్నాడు క్రిష్. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఓ క్రేజీ మూవీ తీస్తున్నాడు. కొన్నాళ్లుగా వినిపిస్తున్న అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఈ సినిమా రాబోతుందట. ఇక ఈ సినిమాలో హీరోగా వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి వారి పేర్లు వినిపించగా ఫైనల్ గా ఆ కథ అల్లు అర్జున్ కోసం అని తెలుస్తుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. మే 4న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్ని దాదాపు క్రిష్ తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ బన్నికి వినిపించడం బన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ సినిమా తర్వాత కాని సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. Related Post

సినిమా స‌మీక్ష