ఈసారి ప్రభాస్ వంతు వచ్చింది..!

April 12, 2018


img

ఇప్పుడిప్పుడే స్టార్లుగా ఉన్న హీరోలు అభిమానుల మధ్య దూరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఎవరికి వారు ఫ్యాన్స్ ఉన్నా మరి ఇప్పుడున్నంత దారుణంగా ఒక హీరో మీద మరో హీరో బురద చల్లే కార్యక్రమం ఉండేది కాదు. అప్పట్లో మల్టీస్టారర్లు కూడా బాగా వచ్చేవి. రాను రాను సోలో ఇమేజ్ వచ్చేసరికి హీరోలు తమ రేంజ్ పెంచుకుంటూ వచ్చారు.

అయితే ఇప్పుడు పరిస్థితి కొంత మారినట్టు కనిపిస్తుంది. ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు. ఇక ఇప్పుడు త్వరలో జరుగబోయే అల్లు అర్జున్ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడని తెలుస్తుంది. కచ్చితంగా ఇది ఓ కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే ఫ్యాన్స్ మధ్య ట్రాలింగ్ లు ఫుల్ స్టాప్ పడతాయో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష