మెహబూబా ట్రైలర్.. పూరి పిచ్చెక్కించేశాడు..!

April 10, 2018


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అందుకే కొద్దిపాటి గ్యాప్ తో తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమా చేస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంతో సాగే ప్రేమకథగా ఈ సినిమా వస్తుంది. మొన్నామధ్య టీజర్ తోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 

సినిమా ట్రైలర్ ఫస్ట్ క్లాస్ టేకింగ్ కనిపిస్తుంది. పూరి కసితో ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన నేహా శెట్టి నటిస్తుంది. సందీప్ చౌత మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మరి ట్రైలర్ తో వారెవా అనిపించిన పూరి సినిమా హిట్ కొట్టేలానే ఉన్నాడని అనిపిస్తుంది. 

పూరి దర్శక నిర్మాతగా వస్తున్న ఈ సినిమా మే 11న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా పూరి ఈ సినిమాను జాగ్రత్తగా చేసి ఉంటాడని అనిపిస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.





Related Post

సినిమా స‌మీక్ష