ఎం.ఎల్.ఏ రివ్యూ & రేటింగ్

March 23, 2018


img

రేటింగ్ : 2.25/5

కథ :

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న కళ్యాణ్ (కళ్యాణ్ రాం) మొదటి చూపులోనే ఇందు (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తాడు. ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఆమె గురించి డీటేల్స్ తెలుసుకుంటాడు. లోపల ఇష్టం ఉన్నా ఇందు కళ్యాణ్ ను కాదనడానికి కారణం తెలుసుకుంటాడు. ఈ క్రమంలో కళ్యాణ్ లైఫ్ లోకి గాడప్ప (రవికిషన్) వస్తాడు. కళ్యాణ్ తన లక్ష్యం మార్చుకుంటాడు. అసలు ఇంతకీ గాడప్ప ఎవరు..? ఇందు కోసం కళ్యాణ్ ఏం చేశాడు..? చివరకు కళ్యాణ్ ఇందుని దక్కించుకున్నాడా లేడా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

పటాస్ తర్వాత షేర్, ఇజం సినిమాల ఫ్లాప్ తో నిరాశ చెందిన కళ్యాణ్ రాం ఈరోజు వచ్చిన ఎం.ఎల్.ఏ తో పర్వాలేదు అనిపించాడని చెప్పొచ్చు. పక్కా కమర్షియల్ మీటర్ సమీకరణాలతో వచ్చింది ఈ సినిమా. డైరక్టర్ ఉపేంద్ర మాధవ్ రొటీన్ కథనే ఎంటర్టైనింగ్ మోడ్ లో తెరకెక్కించాడు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్ చేసిన ఉపేంద్ర మాధవ్ సెకండ్ హాఫ్ రొటీన్ స్క్రీన్ ప్లే నడిపించాడు.

అయితే లీడ్ కాస్ట్ బాగా సెట్ అవడం.. ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎక్కువవడం వల్ల సినిమా కొంతమేరకు పర్వాలేదు అనిపిస్తుంది. హీరోయిన్ ను చూడగానే హీరో ప్రేమించడం.. అది తెలుసుకుని హీరోయిన్ అతనికి ఓ లక్ష్యం పెట్టడం చాలా సినిమాల్లో చూశాం. అయితే ఈ సినిమాలో ఇది కమర్షియల్ వేలో చూపించారు.

అక్కడక్కడ ఆడియెన్స్ కూడా కథ కథనాలను ఊహించేలా దర్శకుడు పేలవమైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గానే కాకుండా నందమూరి ఫ్యాన్స్ ను అలరించే సినిమా ఎం.ఎల్.ఏ అవుతుంది. అయితే కొత్తదనం కోరుకునే వారికి సినిమా నచ్చకపోవచ్చు.

నటన, సాంకేతికవర్గం :

కళ్యాణ్ గా కళ్యాణ్ రాం పాత్ర ఎంతో ఈజ్ తో నటించాడు. పటాస్ తర్వాత కామెడీ టైమింగ్ తో వచ్చిన సినిమా ఇదే. లుక్స్ విషయంలో కళ్యాణ్ రాం చాలా బాగున్నాడు. ఇక కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం రెండిటికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించింది. విలన్ గా రవికిషన్ తన మార్క్ చూపించాడు. పోసాని, వెన్నెల కిశోర్, పృధ్వి రాజ్, బ్రహ్మానందం కామెడీతో అలరించారు.

ఇక ఎం.ఎల్.ఏ టెక్నికల్ టీం విషయానికొస్తే.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ సినిమాకు వన్నె తెచ్చింది. మణిశర్మ సంగీతం ఓకే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగ్స్ కూడా సినిమాలో బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ ఓకే.. అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడ రాజి పడలేదని తెలుస్తుంది.

ఒక్కమాటలో :

ఎం.ఎల్.ఏ.. కళ్యాణ్ రాం మార్క్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్..! 



Related Post

సినిమా స‌మీక్ష