కాలా శాటిలైట్.. రికార్డంటే రజనిదే..!

March 19, 2018


img

సూపర్ స్టార్ రజినికాంత్, పా.రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాల. కబాలి తర్వాత క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమాలో రజిని డాన్ గా కనిపిస్తున్నాడు. సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేయగా ఇప్పుడు శాటిలైట్ రూపంలో కాలా సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా తెలుగు, తమిళ, హింది భాషలన్నిటిని కలిపి 75 కోట్లకు కాలా కొనుగోలు చేశారట.

సౌత్ సినిమాల్లో ఈ రేంజ్ శాటిలైట్ అయిన సినిమాగా కాలా సరికొత్త సంచలనాలను సృష్టించింది. ఈ సినిమాను రజిని అల్లుడు ధనుష్ నిర్మిస్తుండటం విశేషం. నానా పటేకర్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. శాటిలైట్ రైట్స్ తో రికార్డులను సృష్టిస్తున్న కాలా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ హంగామా కొనసాగిస్తుందని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష