రాజమౌళి మెచ్చిన రంగస్థలం..!

March 19, 2018


img

రాం చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరుగగా ఈ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో సిట్టిబాబుగాడి సెవిలోకి మాట ఎల్లడం కష్టం కానీ, ఒక్కసారి ఎల్లిందంటే ఆ మాట అక్కడే ఉండిపోద్దయ్యా.. అంటూ చెప్పిన డైలాగ్ చరణ్ లోని నటుడిని పరిచయం చేస్తుంది.

సినిమా ట్రైలర్ చూసిన రాజమౌళి చిట్టిబాబు ట్రైలర్ అతని మీద ప్రేమ మరింత పెంచిందని.. జగపతి బాబు టెరిఫిక్ గా ఉన్నారని.. సినిమా చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని ట్వీట్ చేశారు. ఇక రంగస్థలం ట్రైలర్ సొంత ప్రాంత్రాన్ని గుర్తుచేస్తుంది. చరణ్ తన పాత్రలో జీవించేశాడని శ్రీను వైట్ల ట్వీట్ చేశాడు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమా హిట్ అన్న టాక్ వచ్చేలా చేసుకున్న రాం చరణ్ రంగస్థలం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

 


Related Post

సినిమా స‌మీక్ష