సిఎం పోస్ట్ కన్నా చిరంజీవి పోస్ట్ పెద్దది..!

March 19, 2018


img

రాం చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం వైజాగ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వేలకొద్ది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మెగా ఫ్యాన్స్ అందరిని ఉత్సాహ పరచింది. ఇక ఈ వేడుకలో డైరక్టర్ సుకుమార్ మాటలు అందరిని ఆశ్చర్యపరచాయి. చిరంజీవి గురించి చెబుతూ ప్రస్థావిస్తున్నందుకు క్షమించండి అంటూ.. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేప్పుడు తనతో దేవి శ్రీ ప్రసాద్ ఓ మాట అన్నాడని.. సిఎం పోస్ట్ కన్నా చిరంజీవి పోస్ట్ పెద్దదిగా మర్ ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నాడని చెప్పారు.

సిఎంలు ఎంతమందైనా ఉండొచ్చు చిరంజీవి ఒక్కడే అది ఆయనే అంటూ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహ పరచాడు సుకుమార్. ఇక చరణ్ ఈ సినిమాలో గొప్పగా చేశాడని. మొదటి సీన్ లోనే యూనిట్ అందరిచేత క్లాప్స్ కొట్టించాడని.. తప్పకుండా ఈ సినిమా అందరి అంచనాలను అందుకుంటుందని అన్నారు. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అందరికి థ్యాంక్స్ చెబుతూ సినిమా చూసి అందరు ఎంజాయ్ చేస్తారని అన్నాడు.   



Related Post

సినిమా స‌మీక్ష