పంచెకట్టులో మహేష్ ను చూశారా..!

March 19, 2018


img

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. సినిమాకు సంబందించిన టీజర్ తో ఇంప్రెస్ చేసిన కొరటాల శివ సినిమాను మరో శ్రీమంతుడు చేసేందుకు కష్టపడుతున్నారు. ఇక ఉగాది సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది.

సినిమాలో మహేష్ పంచెకట్టుతో ఉన్న ఓ పిక్ రిలీజ్ చేసింది. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన మహేష్ పంచెకట్టు పిక్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. మహేష్ ను ఎప్పుడు అలా పంచెకట్టుతో చూడలేదు కాబట్టి ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు చిత్రయూనిట్.



Related Post

సినిమా స‌మీక్ష