కాలా రాకపోతే మహేష్ పండుగే..!

March 17, 2018


img

ప్రిన్స్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ అవుతుంది. అసలైతే ముందు ఏప్రిల్ 27న సినిమా రిలీజ్ అనుకున్నా ఆ డేట్ కు సూపర్ స్టార్ రజినికాంత్ కాలా వస్తుందని మహేష్ సినిమా ఓ వారం ముందుకు జరిపారు. ఇక బన్ని నా పేరు సూర్య మాత్రం మే 4న రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అండర్ స్టాండింగ్ తో రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.

ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తమిళనాడు థియేటర్స్ బంధ్ వల్ల కాలా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. అలా జరిగితే కనుక మహేష్ భరత్ అనే నేను సినిమా బాక్సులు బద్ధలు కొట్టడం ఖాయమని తెలుస్తుంది. మహేష్ సిఎంగా నటిస్తున్న భరత్ అనే నేను సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష