బిగ్ బాస్-2 అతనికే ఓటేశారా..!

March 17, 2018


img

స్టార్ మా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిగ్ బాస్ మొదటి సీజన్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ వన్ టి.ఆర్.పి రేటింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-2 కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్ లో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయడం దాదాపు కుదరనట్టే అని తెలుస్తుంది.

అందుకే నాచురల్ స్టార్ నాని సీజన్-2 హోస్ట్ గా చేస్తాడట. ముందు దగ్గుబాటి రానాని ఈ సీజన్ కు తీసుకుందామని అనుకోగా మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని బిగ్ బాస్ సీజన్-2 హోస్ట్ గా అంటే ఇక ఆ షో ఎలా ఉండబోతుందో అని నాని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. జూలై లో మొదలవనున్న ఈ షోలో ఈసారి పార్టిస్పెంట్స్ ఎవరన్నది కూడా త్వరలో తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష