ఎం.ఎల్.ఏ ట్రైలర్.. డైలాగ్స్ తో వార్నింగ్ ఇస్తున్న కళ్యాణ్ రాం..!

March 17, 2018


img

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. కళ్యాణ్ రాం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలు పెంచేలా ఈ ట్రైలర్ ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా కళ్యాణ్ రాం డైలాగ్స్ బాగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రాజకీయాలకు సంబందించిన డైలాగ్స్ తో కళ్యాణ్ రాం నందమూరి ఫ్యాన్స్ ను అలరించాడు.

మార్చి 23న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా సినిమా కూడా కళ్యాణ్ రాం కెరియర్ లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. మరి డైలాగ్స్ తో వార్నింగ్ ఇస్తున్న కళ్యాణ్ రాం సినిమాను అనుకున్న రేంజ్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే చెప్పగలం. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను భరత్, కిరణ్ కలిసి నిర్మించారు.  





Related Post

సినిమా స‌మీక్ష