ఎన్.టి.ఆర్ తో ఆ విలన్ మళ్లీ రిపీట్..!

March 15, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా ఈ నెలలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబుని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. హీరోగా కెరియర్ ఫుల్ స్టాప్ పెట్టేసి లెజెండ్ తో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్న జగ్గూ భాయ్ ఇప్పుడు విలన్ గా మంచి ఫాం లో ఉన్నాడు.

ఇక ఎన్.టి.ఆర్ తో ఆల్రెడీ నాన్నకు ప్రేమతో సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన జగపతి బాబు మళ్లీ ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష