సుకుమార్ కు నో చెప్పిన కుమారి..!

March 13, 2018


img

మొదటి సినిమా అలా ఎలా అన్నది ఎవరికి తెలియకున్నా సరే కుమారి 21ఎఫ్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది హెబ్భా పటేల్. ఆ సినిమా వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం అమ్మడికి చేతిలో పెద్దగా సినిమాలు లేవనుకోండి. అయినా సరే సుకుమార్ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ను సైతం కాదనేసిందట. కుమారి 21ఎఫ్ సినిమా సుకుమార్ నిర్మాతగా తన కథతో వచ్చింది.

ఈ సినిమా ఆమె కెరియర్ ను టర్న్ చేసింది. మరి అలాంటి సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా చేసిన రంగస్థలం ను ఎందుకు కాదంది అంటే.. సినిమాలో ఆమెను హీరోయిన్ పాత్రకు కాకుండా ఓ చిన్న రోల్ కు సెలెక్ట్ చేశాడట. ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో హెబ్భా చేయనని చెప్పిందట. అయితే ఆ రోల్ ను హెబ్భా ప్లేస్ లో అనసూయ చేసిందని అంటున్నారు. యాంకర్ గా బుల్లితెరను షేక్ చేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా ఆ మెరుపులు చూపించాలని ప్రయత్నిస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష