కైకాలను చంపేసిన సోషల్ మీడియా..!

March 13, 2018


img

సోషల్ మీడియా పుణ్యమాని బ్రతికి ఉన్న వారు కూడా తాము చనిపోయిన వార్తలు విని మేము బ్రతికేం ఉన్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా కైకాల సత్యనారాయణ చనిపోయాడని వార్తలు రాశారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే చనిపోయింది సత్యనారాయణ అనే నటుడే కాని ఆయన కైకాల సత్యనారాయణ కాదు వంకాయల సత్యనారాయణ. 

కైకాల సత్యనారాయణ తరానికే చెందిన వంకాయల సత్యనారాయణ దాదాపు 180కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన మరణించిన వార్తలు రాగా నటుడు సత్యనారాయణ అనుకుని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కైకాలను చంపేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఈ వార్తలను ఖండించింది. ఇప్పటికే ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మీద సైబర్ క్రైం లో ఫిర్యాదు చేశారు మా సభ్యులు. అయినా సరే ఇలాంటి వార్తలు రావడం ఆగిపోలేదు.  Related Post

సినిమా స‌మీక్ష