కథల విషయంలో 'మెగా' యూనియన్..!

March 13, 2018


img

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి సక్సెస్ అందుకున్న హీరోలంతా ఇప్పుడు కథల విషయంలో ఓ కమిట్మెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. ఈమధ్యనే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత బర్త్ డే వేడుకల్లో కలిసిన మెగా హీరోలంతా ఇక నుండి కథల విషయంలో ఒకరి సలహా మరొకరు తీసుకునేలా మాట్లాడుకున్నారట. అంతేకాదు క్లాస్, మాస్ ఇలా జానర్ ఏదైనా ఒకరి దగ్గరకు వచ్చిన కథను తమకు సూట్ అవదని అనుకుంటే మిగతా మెగా హీరోల దగ్గరకు ఆ కథ పంపించాలని అనుకున్నారట.

ఇక సినిమాల విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్న యువ మెగా హీరోలకు ఇచ్చేలా చర్చలు నడిపించారట. ప్రస్తుత్మ అల్లు అర్జున్ నా పేరు సూర్యలో నటిస్తుండగా.. రాం చరణ్ రంగస్థలం రిలీజ్ కు రెడీ అవుతుంది. వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డితో.. సాయి ధరం తేజ్ కరుణాకరణ్ తో సినిమాలు చేస్తున్నారు. అల్లు శిరీష్ మాత్రం తన తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఇక ఈమధ్యనే చిరు చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా తొలి సినిమా ముహుర్తం జరిగింది. మొత్తానికి ఈ మెగా కమిట్మెంట్ తో ఇక మెగా హీరోలంతా వరుస హిట్లు కొట్టాలని చూస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష